Friday, September 28, 2007

రాశి చక్రం

రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది మరియు అది 180 డిగ్రీలు గల రెండు భాగాలు గా విభజింపబడి ఉన్నది.
తొలి సగము సూర్యునిది.దీనినే దక్షిణాయణముగా పిలుచుకుంటాము. ఇది 0 డిగ్రీలు సింహరాశి మొదలుకొని 30 డిగ్రీలు మకరరాశి వరకు వ్యాపించి ఉంటుంది.ఇది సూర్య హోర గ వ్యవహరింపబడుతుంది.

రెండవ సగము చంద్రునిది. దీనినే ఉత్తరయణము వ్యవహరిస్తాము. దీని నిడివి 0 డిగ్రీలు కుంభరాశి మొదలుకొని 30 డిగ్రీలు కర్కాటకరాశి వరకు.ఇది చంద్ర హోర గా వ్యవహరిస్తాము.

పైన ఉదహరించిన రెండు సగములు మరల ఒక్కొక్కటి 30 డిగ్రీలు నిడివి గల 6 భాగాలుగా విభజింపబడినవి.ఈ భాగాలకు వరుసగా బుధ(మిథున,కన్య),శుక్ర(వృషభ,తుల),కుజ(మేష,వృశ్చిక),గురు(ధను,మీన),శని(మకర,కుంభ) గ్రహాలకు పాలనాధికారము ఒసగబడినది. సింహ,కర్కాటక రాశులకు సూర్య,చంద్రులు అధిపతులు.

Saturday, September 15, 2007

శ్రీ విఖనస మహర్షి






ప్రార్థన :-

శ్రీ లక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం